Raja Saab Collections: రాజాసాబ్ 10 రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే.?

ఎన్ని కోట్లు అంటే.?

Update: 2026-01-19 04:32 GMT

Raja Saab Collections: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్-కామెడీ చిత్రం 'ది రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. జనవరి 9, 2026న విడుదలైన ఈ సినిమా మొదటి వారం భారీ వసూళ్లు సాధించినప్పటికీ, రెండో వారంలో కొంత నెమ్మదించింది.సినిమాకు ఆరంభంలో మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్, సంక్రాంతి సీజన్ వల్ల మొదటి మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది .సోమవారం నుండి వసూళ్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం సినిమా రూ.200 కోట్ల మార్కును చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. అభిమానుల కోరిక మేరకు దర్శకుడు మారుతి ఇటీవల సినిమాలో 8 నిమిషాల కొత్త సీన్లను (ప్రభాస్ ఓల్డ్ గెటప్) యాడ్ చేశారు. ఇది రెండో వారంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి కొంతవరకు దోహదపడింది.

తాజా ట్రేడ్ రిపోర్ట్స్ Sacnilk ప్రకారం 10 రోజుల కలెక్షన్లు భారత్ లో సుమారు రూ. 139.25 కోట్లు.ప్రపంచవ్యాప్తంగా (Gross) సుమారు రూ.180 కోట్లు వచ్చినట్లు తెలిపింది.

ఆదివారం (జనవరి 18) దేశవ్యాప్తంగా సుమారు రూ. 2.50 కోట్లు వసూలు చేసింది. సినిమా ఓపెనింగ్ మొదటి రోజు రూ. 53.75 కోట్లు (ప్రివ్యూలతో కలిపి రూ. 62.9 కోట్లు),మొదటి వారం ,రూ. 130.25 కోట్లు , 8వ రోజు (శుక్రవారం)రూ. 3.50 కోట్లు9వ రోజు (శనివారం) రూ.3.00 కోట్లు10వ రోజు (ఆదివారం) రూ. 2.50 కోట్లు (అంచనా) వచ్చాయి.

Tags:    

Similar News