Raashi Singh: మేకప్ లేకుండానే నటించా..నా కెరీర్‌లోనే డిఫరెంట్ పాత్ర: హీరోయిన్ రాశి సింగ్

హీరోయిన్ రాశి సింగ్

Update: 2026-06-19 06:18 GMT

Raashi Singh: సీనియర్ హీరో వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో, ఆయనే స్వయంగా నిర్మాతగా మారి రూపొందించిన సరికొత్త చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ్ నార్ల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఈరోజే (జూన్ 19న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి సింగ్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

వడ్డే నవీన్ గారితో సినిమా అని తెలిశాక, నేను ఆయన గురించి చాలా రీసెర్చ్ చేశాను. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల గురించి తెలుసుకున్నాను" అని రాశి సింగ్ చెప్పారు. ఇదొక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా అని, ఇందులో తను ఒక పక్కింటి అమ్మాయి లాంటి సహజమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమా కోసం రాశి సింగ్ ఎలాంటి మేకప్ లేకుండా చాలా నేచురల్‌గా నటించారట. ఇందులో తను 'లక్ష్మి' అనే ఒక గృహిణి పాత్రను పోషించారు. ఉద్యోగ రీత్యా భర్తకు జరిగే ట్రాన్స్‌ఫర్స్ విషయంలో లక్ష్మి అనే క్యారెక్టర్ ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిరాకు పడినా, ప్రతీ విషయంలో భర్తకు సపోర్ట్‌గా నిలిచే భార్యగా తన నటన కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ రోల్ అవుతుందని రాశి ధీమా వ్యక్తం చేశారు.

ఇక వడ్డే నవీన్ గురించి చెబుతూ... "ఆయన చాలా ఇంటలెక్చువల్ పర్సన్. ఆయనకు వరల్డ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. అలాంటి సీనియర్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని రాశి సింగ్ అన్నారు. తన కెరీర్‌లో ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. ప్రస్తుతం ‘గాసిప్’ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నానని, మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో రకరకాల వైవిధ్యమైన పాత్రలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలు చేయడమే తన టార్గెట్ అని రాశి సింగ్ ముగించారు.

Tags:    

Similar News