Rashmika Mandanna: ఆ సీన్లు చూసి తట్టుకోలేకపోయా.. రణబాలిపై రష్మిక మందన్న క్రేజీ పోస్ట్..
రష్మిక మందన్న క్రేజీ పోస్ట్..
Rashmika Mandanna: టాలీవుడ్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో వస్తున్న సరికొత్త చిత్రం రణబాలి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూసిన ఆమె.. అందులోని విజువల్స్ చూసి తానెంతో ఎగ్జైట్ అయ్యానంటూ పంచుకున్న విషయాలు ఫ్యాన్స్‌లో అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి.
సినిమా రషెస్ చూసిన అనంతరం రష్మిక తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. "ఈ విషయాన్ని మీతో పంచుకోవచ్చో లేదో నాకు తెలియదు. గతంలో లాగే ఈ పోస్ట్‌ను కూడా డిలీట్ చేయమని నన్ను ఎవరూ అడగరని ఆశిస్తున్నాను. కానీ ఈ చిత్ర బృందం స్క్రీన్‌పై నిజంగానే బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. వాటిని చూశాక నా ఉత్సాహాన్ని అస్సలు ఆపుకోలేకపోయాను. ఈ అద్భుతాన్ని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు హీరో విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌ను కూడా ఆమె ట్యాగ్ చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో గతంలో వచ్చిన గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న రణబాలి సినిమాలో వీరిద్దరూ మరోసారి జోడీ కడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విజయ్ రణబాలిగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుండగా, రష్మిక జయమ్మ అనే విలక్షణమైన పాత్రలో అలరించనున్నారు.