Trending News

నేను క్షమాపణలు చెప్పను...

...తేల్చి చెప్పిన కమల్‌హాసన్

Update: 2025-05-30 11:40 GMT

స్టార్ హీరో కమల్‌హాసన్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన చిత్రం 'థగ్ లైఫ్' ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కన్నడ భాషను కించపరిచేలా ఉన్నాయంటూ.. కన్నడిగులు కమల్‌పై మండిపడుతున్నారు. కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కమల్ స్పందించరు. తాను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని లేకుంటే చెప్పను అని తేల్చి చెప్పేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, తాను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతానని.. వాటిని గౌరవిస్తానని అన్నారు.'థగ్‌ లైఫ్' ఈవెంట్‌లో కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కర్ణాటక అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించింది. మే 30లోగా కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించింది. మరోవైపు కమల్ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే వివరణ ఇచ్చారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని.. ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు.

Tags:    

Similar News