Rakhi Sawant's Shocking Remark: నాకు పేదరికం అంటే నచ్చదు.. డబ్బుల పరుపుపైనే పడుకుంటా: రాఖీ సావంత్
రాఖీ సావంత్
Rakhi Sawant's Shocking Remark: బాలీవుడ్ డ్రామా క్వీన్, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ రాఖీ సావంత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా ఆమె క్వీనీ సింగ్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని, డబ్బు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తనకు 'గరీబీ' అంటే అస్సలు నచ్చదని.. డబ్బులు ఉంటే పడుకోవడానికి మంచం కూడా అవసరం లేదు, ఆ డబ్బుల పరుపు పైనే పడుకుంటానని రాఖీ ఓపెన్‌గా చెప్పేసింది.
"నాకు డిప్రెషన్ వస్తే తగ్గడానికి 'మనీ-టాన్', 'మనీ సింగ్', 'మనీ-సెటమాల్' లాంటి మనీ టాబ్లెట్స్ కావాలి" అంటూ తనదైన స్టైల్లో పంచ్‌లు వేసింది. అంతేకాదు తన లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి చెప్తూ హోస్ట్‌కే షాక్ ఇచ్చింది రాఖీ. "నా తలపై ఉన్న ఈ రష్యన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కోసం ఒక్కో సెషన్‌కు 12 లక్షల రూపాయలు అవుతుంది. దుబాయ్, లండన్, కెనడాలోనే ఇది చేయించుకున్నా. నా నెయిల్స్ ఇండియాలో చేయించుకోను, ఐ లాషెస్ ఆఫ్రికాలో చేయించా. నా జాలైన్, చీక్స్, లిప్స్, నోస్.. ఇదంతా కేవలం డబ్బు మహిమే" అంటూ చెప్పుకొచ్చింది.
రాఖీ సావంత్ మాటలు పైకి కాస్త వింతగా, నవ్వు తెప్పించేలా ఉన్నా.. ఆమె జీవితంలో డబ్బు కోసం పడ్డ కష్టాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. ఒకప్పుడు అమాయకమైన పిల్లను అని, కేవలం ఇల్లు గడవడానికి, డబ్బు సంపాదించడానికే కెమెరా ముందు బోల్డ్‌గా మారాల్సి వచ్చిందని రాఖీ ఎమోషనల్ అయ్యింది. గతంలో తన తల్లి క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్‌మెంట్ కోసం రాఖీ ఎంతగానో తపించింది. బిగ్ బాస్ 14లో కూడా కేవలం తల్లి వైద్యం కోసమే 14 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని మధ్యలోనే వచ్చేసింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ తనకు దేవుడిలా సాయం చేశారని గుర్తుచేసుకుంది.
దురదృష్టవశాత్తూ 2023లో ఆమె తల్లి చనిపోగా, 2024లో రాఖీ కూడా గర్భాశయ ట్యూమర్‌తో పోరాడింది. అప్పుడు కూడా సల్మాన్ ఖానే మెడికల్ బిల్స్ కట్టారు. జీవితంలో డబ్బు లేకపోతే సమాజం ఎలా చూస్తుందో, డబ్బు ఉంటే ఎలాంటి వైద్యం అందుతుందో ప్రాక్టికల్‌గా చూసింది కాబట్టే.. ఈరోజు రాఖీ సావంత్ ఫోకస్ అంతా కేవలం డబ్బు సంపాదించడం పైనే ఉంది. ప్రపంచం తనను ఏమనుకున్నా సరే.. తాను మాత్రం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికే బ్రాండ్స్, క్లబ్ షోస్ చేస్తూ కష్టపడుతున్నానని నిరూపించింది.