Priyanka Chopra: హిందీ సినిమాలు మిస్సవుతున్నా : ప్రియాంక చోప్రా

సినిమాలు మిస్సవుతున్నా;

Update: 2025-07-04 15:06 GMT

Priyanka Chopra: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి షిఫ్ట్ అయిన నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ సినిమాలో నటిస్తోందీ భామ. తాజాగా ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో.. తాను ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పు కొచ్చింది. 'హెడ్స్ ఆఫ్ స్టేట్ ' సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా హిందీ చిత్రసీమకు దూరంగా ఉండటం గురించి మాట్లాడింది. తాను హిందీ సినిమాలు మిస్సవుతున్నానని, ఇండియానూ మిస్సవుతున్నానంటూ ఆవేదన వెలిబుచ్చింది. కానీ ప్రస్తుతానికి భారతదేశంలో ఓ సినిమాలో నటిస్తున్నాని ప్రియాంక చోప్రా వెల్లడించింది. రాజమౌళి మహేశ్ లతో ఎస్ఎస్ఎంబి 29లో నటిస్తున్నానని తెలిపింది. ఈ సినిమా విడుదల కోసం నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కూడా పేర్కొంది. ఈ సినిమా మెజారిటీ భాగం దట్ట మైన అడవుల్లో తెరకెక్కిస్తున్నారు. కెన్యాలోని డీప్ ఫారెస్ట్ లో ఈ సినిమాని చిత్రీకరించాల్సి ఉందని కూడా తెలుస్తోంది. ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా కేటగిరీలో అద్భుతాలు చేస్తుందనే టాక్ ఉంది. ఈ మూవీని అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లోనూ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమా గురించి ప్రియాంక మాట్లాడారు. ‘‘నేను ఎక్కువ సినిమాలు చూస్తూ పెరగలేదు. మా నాన్నకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ సంగీతం వినిపిస్తూనే ఉండేది. నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు ముంబయిలో ఓ థియేటర్‌లో ‘బొంబాయి’ చూశాను. నాకు ఊహ తెలిశాక చూసిన మొదటి సినిమా అదే. ఆ అనుభవాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. నేటికీ ఆ సినిమా చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. 

Tags:    

Similar News