Mrunal Apologizes to Bipasha Basu: అపుడు తెలియక మాట్లాడా..బిపాసా బసుకు సారీ చెప్పిన మృణాల్
బిపాసా బసుకు సారీ చెప్పిన మృణాల్;
Mrunal Apologizes to Bipasha Basu: నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఎందుకంటే.. గతంలో మృణాల్ ఠాకూర్ 19 ఏళ్ల వయసులో ఒక పాత ఇంటర్వ్యూలో నటి బిపాసా బసు శరీర ఆకృతిపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూలో మృణాల్ ఒక యాంకర్‌తో మాట్లాడుతూ బిపాసా బసు కండలు తిరిగిన మగాడిలా కనిపిస్తుంది. నేను బిపాసా కంటే అందంగా ఉంటాను" అని వ్యాఖ్యానించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై బిపాసా బసు కూడా కౌంటర్ ఇచ్చారు. మహిళలు బలంగా ఉండాలి. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా ఉండకూడదు అనేది పాతకాలపు ఆలోచనలు. అలాంటి ఆలోచనల నుంచి బయటకు రావాలి" అని పోస్ట్ చేశారు. దీనిపై మృణాల్ ఠాకూర్ క్షమాపణలు చెబుతూ అది తాను 19 ఏళ్ల వయసులో తెలియక మాట్లాడిన మాటలని, ఎవరినీ బాధపెట్టాలని అలా మాట్లాడలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
డిప్రెషన్,ఆత్మహత్య ఆలోచనలు
మరొక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు అవకాశాలు లేక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడ్డానని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని వెల్లడించారు. ఒకసారి ముంబైలో లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకున్నా. కానీ నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నా" అని ఆమె తెలిపారు. టీవీలో కనిపించాలన్న తన కోరికను నిజం చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డానని, తన తల్లిదండ్రులను ఒప్పించి మీడియా స్టడీస్‌లో డిగ్రీ చేశానని చెప్పారు.