రజనీకాంత్‌తో నటించాలని ఉంది - కావ్య థాపర్‌

I want to act with Rajinikanth - Kavya Thapar

Update: 2025-06-17 09:11 GMT

రజనీకాంత్‌తో తనకు ఒక్కసారైనా నటించాలన్న కోరిక ఉందని సినీనటి కావ్య థాపర్‌ తన మనసులోని మాటను వెల్లడించారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కావ్య థాపర్‌ పొలిటెంట్‌ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.



తాను ఇప్పటివరకు అసాధారణమైన పనేమీ చేశానని అనిపించలేదని, కానీ భవిష్యత్తులో అద్భుతమైన పనులు చేసి అవార్డులకు అర్హురాలవుతానన్న ఆశాభావాన్ని కావ్య థాపర్‌ వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తాను అవార్డులు అందుకునే స్థాయికి రాలేదనుకుంటున్నానని, అయితే, భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అందుకుంటానని చెప్పింది.



తన ఫ్యాన్స్‌ను ప్రేమిస్తున్నానని, తన ఫ్యాన్స్‌ క్రియేట్‌ చేసిన ఫ్యాన్ పేజెస్, మీమ్స్, ట్రోల్స్ అన్నిటినీ తాను ఆస్వాదిస్తున్నానని కావ్య థాపర్‌ వెల్లడించింది. అభిమానులు తనపై చూపుతున్న ప్రేమకు చాలా థ్యాంక్స్ అంటూ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలు కావ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి.


Tags:    

Similar News