Meena: ఆరోజు సౌందర్యతో హెలికాప్టర్లో వెళ్లాల్సింది నేను : మీనా

హెలికాప్టర్లో వెళ్లాల్సింది నేను : మీనా

Update: 2025-09-15 09:31 GMT

Meena: నటుడు జగపతి బాబు ఒక టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దీని పేరు "జయంబు నిశ్చయంబురా విత్ జగపతి". ఈ షోలో పాతతరం, కొత్తతరం సినీ ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. ఈ షోకు ఇటీవలే హీరోయిన్ మీనా అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ షోలో మీనా తన కెరీర్, వ్యక్తిగత జీవితం, దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జగపతి బాబు సౌందర్యతో కలిసి దిగిన ఒక పాత ఫోటోను మీనాకు చూపించగా, ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో సౌందర్యతో తనకున్న స్నేహం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో హీరోయిన్ల మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉండేదని, సినిమాల్లో పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా తామంతా బాగా కలిసి ఉండేవారని మీనా పేర్కొన్నారు. సౌందర్య వెళ్లన హెలికాప్టర్లో నేను కూడా వెళ్లాల్సి ఉందని కానీ సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా తాను ఆరోజు ఆ హెలికాప్టర్లో వెళ్లలేదని మీనా వెల్లడించారు. తాను చనిపోయింది అని తెలుసుకుని చాలా షాక్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు మీనా. సోషల్ మీడియా పుకార్ల వల్ల తన జీవితం ఎలా ప్రభావితమైందో కూడా ఆమె వివరించారు. తన భర్త చనిపోయిన వారం రోజుల తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసినట్టు మీనా వివరించారు. ఆ వార్తలు తనని ఎంతో బాధపెట్టాయని అన్నారు.

Tags:    

Similar News