Lalit Modi: ఆమె డబ్బులపై నేనే ఆధారపడ్డాను!.. సుస్మితా సేన్‌పై ఆరోపణలను తిప్పికొట్టిన లలిత్ మోదీ

సుస్మితా సేన్‌పై ఆరోపణలను తిప్పికొట్టిన లలిత్ మోదీ

Update: 2026-06-02 05:17 GMT

Lalit Modi: బాలీవుడ్ సీనియర్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌పై వచ్చిన 'మనీ మైండెడ్' (డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి) అనే ఆరోపణలపై ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన సుస్మితా సేన్‌ను వెనకేసుకొస్తూ, విమర్శకుల నోళ్లు మూయించేలా మాట్లాడారు.

లలిత్ మోదీ మాటల్లోనే: "నాకు తెలిసిన చాలామంది కంటే సుస్మిత వద్దే ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. వాటిని ఆమె ఎవరి దగ్గరో ఆశించలేదు, స్వయంగా సంపాదించుకుంది. చివరికి ఆమెకు సొంతంగా డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మేము కలిసి ఉన్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు నేను దేనికీ డబ్బులు చెల్లించాల్సిన సందర్భమే రాలేదు. ఆమెనే అన్నింటికీ బిల్స్ కట్టేది. నిజం చెప్పాలంటే.. నేనే ఆమె డబ్బులపై ఆధారపడేవాడిని.

సుస్మితా సేన్ ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించడానికి ఇష్టపడదని, ఆమె గురించి అస్సలు తెలియనివాళ్లు మాత్రమే అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారని మోదీ మండిపడ్డారు. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి చెబుతూ.. "సుస్మిత నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి, నా ఎదుగుదలకు ఆమె ఎంతో సహాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం" అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసుల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు. అయితే, 2022లో సుస్మితా సేన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. సుస్మిత కేవలం లలిత్ మోదీ డబ్బు కోసమే ఆమెతో తిరుగుతోందంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ లలిత్ మోదీ తాజా ఇంటర్వ్యూతో గట్టి సమాధానమే ఇచ్చారు.

Tags:    

Similar News