Anushka Shetty: నాకు ఒక్కసారైనా అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది

అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది

Update: 2025-09-04 07:01 GMT

Anushka Shetty: అనుష్క లీడ్ రోల్ లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఘాటీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 5న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ సినిమా థ్రిల్లర్, యాక్షన్, డ్రామా జెనర్‌లో రూపొందింది. అనుష్క శెట్టి ఒక పవర్ ఫుల్ యాక్షన్- ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు.

ఘాటి సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన నటి అనుష్క శెట్టి తన కెరీర్, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉందన్నారు. చాలా కాలంగా నేను డిఫరెంట్ రోల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా తదుపరి సినిమా ఘాటిలో కూడా ఒక మహిళా ఫైటర్‌గా కొత్త పాత్రలో కనిపిస్తాను. అయితే, ఒక నటిగా నా సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించుకోవడానికి ఒక పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. విలన్ పాత్రలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి, అటువంటి క్యారెక్టర్ చేయడం నాకు సవాలుగా అనిపిస్తుంది" అని అన్నారు.

ఆమె గతంలో చేసిన పాత్రలు, ముఖ్యంగా బాహుబలి, భాగమతి, అరుంధతి వంటి సినిమాలు ఆమె నటనకు మంచి పేరు తెచ్చాయి. అయితే, ఆమె ఎక్కువగా సానుకూల పాత్రలనే పోషించారు. అందుకే, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసేందుకు ఆమె ఉత్సాహం చూపిస్తున్నారు.

Tags:    

Similar News