Icon Star Showers Praise on ‘Dhuranthar’: ధురంధర్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసల వర్షం.. కెప్టెన్ అంటూ ఆసక్తికర కామెంట్స్

కెప్టెన్ అంటూ ఆసక్తికర కామెంట్స్

Update: 2025-12-12 13:56 GMT

Icon Star Showers Praise on ‘Dhuranthar’: బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బ్లాక్‌బస్టర్ చిత్రం ధురంధర్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆయన ఎక్స్ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

"ఇప్పుడే ధురంధర్ సినిమా చూశాను. అత్యుత్తమ నటన, అద్భుతమైన సాంకేతికత, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లతో కూడిన గొప్ప చిత్రం ఇది. నా సోదరుడు రణ్‌వీర్ సింగ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తానికే అతడు హైలైట్‌గా నిలిచాడు" అంటూ కితాబిచ్చారు. అక్షయ్ ఖన్నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలలో జీవించారని కొనియాడారు. హీరోయిన్ సారా అర్జున్ నటన కూడా ఆకట్టుకుందని తెలిపారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను కెప్టెన్ అని సంబోధిస్తూ ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని విజయవంతంగా రూపొందించారని ప్రశంసించారు.

Tags:    

Similar News