Tara Sutaria: ఇండస్ట్రీలో నేను పోరాటం చేస్తున్నా : తారా సుతారియా
నేను పోరాటం చేస్తున్నా;
Tara Sutaria: 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటి తారా సుతారియా. చివరిగా ఆమె నటించిన సర్వైవల్ థ్రిల్లర్ 'అపూర్వ' 2023లో విడుదల కాగా.. ప్రస్తుతం ‘ఆవారాపన్ 2’ కోసం సిద్ధమవుతోంది. అయితే ఇండస్త్రీలో తన సినీ ప్రయాణం 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యిన సందర్భంగా తారా ఇంట్రెస్టింగా కామెంట్స్ చేసింది. పరి శ్రమలో తన పోరాటంపై మాట్లాడుతూ ఔట్ సైడర్ గా తాను ఒంటరిని అయ్యానని తెలిపింది. ఒకానొక దశలో తనకు మార్గనిర్దేశనం చేసే సరైన వ్యక్తి కావాలని అనిపించినట్టు వెల్లడించింది. 'నేను సినిమాల్లో కెరీర్ ప్రారంభించినప్పుడు, నాకు పరిశ్రమలో చాలా మంది తెలియదు. చాలా విషయాలకు అలవాటు పడటానికి టైం పట్టింది. ఇక్కడ నేను ఒంటరి పో రాటం చేస్తున్నట్టు అనిపించింది. నాకు మార్గదర్శకత్వం ఉంటే బాగుండు అని నేను కోరుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ లోపలి నుంచి నాకు ఎవరైనా సహాయం చేయగలిగితే బాగుండేది. ఇన్ సైడర్స్ కి చాలా విషయాలు వర్కవుట్ అవుతాయి' అంటూ చెప్పుకొచ్చిం ది. ఇక తారా సుతారియా ఇటీవలే తన మాజీ ప్రియుడు, ప్రాణ స్నేహితుడు ఆధార్ జైన్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ లకు ఆధార్ జైన్ బంధువు. తారా నుంచి విడిపోయాక ఆధార్ ఫిబ్రవరి 2025లో తారా స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నాడు. ఆధార్ నుంచి విడిపోయిన తర్వాత తారా సుతారియా నటుడు అరుణోదయ్ సింగ్‌తో కొంతకాలం సంబంధంలో ఉందని ప్రచారం సాగింది. కానీ ఆమె ఆ పుకార్లను తోసిపుచ్చింది. అతడిని కేవలం స్నేహితుడు అని పేర్కొంది. కాగా తారా సుతారియా 1995 నవంబర్ 19న ముంబైలో హిమాన్షు సుతారియా, టీనా సుతారియా దంపతులకు జన్మించింది. ఆమె ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసింది.