Indian Beauty Kriti Sanon: ప్రపంచంలోని టాప్ 100 అందగత్తెల్లో .. మన ఇండియన్ బ్యూటీ
మన ఇండియన్ బ్యూటీ;
Indian Beauty Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అరుదైన ఘనత సాధించింది. IMDb (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ఇన్ ది వరల్డ్ జాబితాలో కృతి సనన్ చోటు దక్కించుకున్నారు. 2025-2026 సంవత్సరానికి గాను విడుదలైన ఈ జాబితాలో కృతి సనన్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక భారతీయ నటి కృతి సనన్. ఈ గుర్తింపుతో ఆమె ఎమ్మా వాట్సన్, అనా డె అర్మాస్ వంటి అంతర్జాతీయ నటీమణులను అధిగమించి గ్లోబల్ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆమె స్టైల్, అందం, నటనకు ఇది ఒక మంచి గుర్తింపు అని చెప్పవచ్చు.
ఇప్పటికే మిమీ (Mimi) సినిమాలో ఆమె నటనకు గాను 2021లో ఉత్తమ నటి నేషనల్ ఫిలిం అవార్డ్ (Best Actress) అవార్డును గెలుచుకున్నారు.అలాగే హీరోపంతి (Heropanti) చిత్రానికి Best Female Debut అవార్డు. మిమీ చిత్రానికి ఉత్తమ నటి (Best Actress) అవార్డు దక్కించుకున్నారు. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ టాప్ 100 లో చోటు దక్కించుకున్నారు.
టాప్ 5లో ఉన్నవారు:
మార్గోట్ రోబీ
షైలీన్ వుడ్లీ
దిల్ రాబా దిల్మురాత్
నాన్సీ మెక్డోనీ
కృతి సనన్