Dispute Between Deepika and Triptii: దీపిక, త్రిప్తి మధ్య వివాదం ముగిసినట్టేనా..?

వివాదం ముగిసినట్టేనా..?

Update: 2025-10-07 07:46 GMT

 Dispute Between Deepika and Triptii: స్పిరిట్' సినిమా కారణంగా నటి త్రిప్తి దిమ్రి, దీపికా పదుకోణె మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, త్రిప్తి దిమ్రి పరోక్షంగా దీపికకు మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో దీపిక వీడియోకు త్రిప్తి దిమ్రి లైక్ చేయడం ద్వారా దీపిక పట్ల తనకు గౌరవం, మద్దతు ఉన్నాయని స్పష్టం చేశారు. చాలా మంది నెటిజన్లు త్రిప్తి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోస్పిరిట్' సినిమా హీరోయిన్‌గా మొదట దీపికా పదుకోణెను అనుకున్నారు. అయితే, దీపికా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. దీపికా తప్పుకున్న తర్వాత, ఆమెపై సోషల్ మీడియాలో, కొన్ని మీడియా కథనాలలో 'నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఓ యూజర్ షేర్ చేసిన రీల్‌ను తరిప్తి దిమ్రి లైక్' చేయడంతో పరోక్షంగా దీపికకు మద్దతు తెలిపారు.

యూజర్ చేసిన వీడియోలో ఏముందంటే..'రామ్ లీలా' సినిమాలోని 'నాగడా సంగ్ ధోల్' పాట షూటింగ్ సమయంలో దీపికా పదుకోణె ప్రొఫెషనలిజాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ వీడియో పోస్ట్ చేశారు. సుమారు 30 కేజీల బరువున్న లెహెంగా ధరించి, చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం, ఆమె కాళ్లకు రక్తం వస్తున్నప్పటికీ షూటింగ్‌ను ఆపకుండా పూర్తి చేయడం వంటి విషయాలను గుర్తుచేశారు. ఈ పోస్ట్ కు త్రిప్తి దిమ్రి లైక్ చేశారు. దీంతో దీపికకు త్రిప్తి (Triptii Dimri) మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

Tags:    

Similar News