Jalsa' Actress Parvathi Melton: గుడ్ న్యూస్ చెప్పిన 'జల్సా' నటి పార్వతి మెల్టన్.. ఫొటోలు వైరల్
ఫొటోలు వైరల్
Jalsa' Actress Parvathi Melton: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం జల్సాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పార్వతి మెల్టన్ గుడ్ న్యూస్ తెలిపింది. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆమె తన బేబీ బంప్‌తో దిగిన ఫొటోలను షేర్ చేయగా, అవి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న పార్వతి
వెన్నెల చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన పార్వతి మెల్టన్, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా జల్సా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే, 2012లో అమెరికాకు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. పెళ్లైన 13 సంవత్సరాలకు ఆమె తల్లి కాబోతుండటం విశేషం.
కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నప్పటికీ, పార్వతి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్‌పై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు అభినందనలు తెలుపుతుండగా, మరికొందరు బేబీ బంప్‌తో ఇంత హాట్‌గా ఫొటోషూట్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.