Jaya Bachchan’s Harsh Remarks: జయాబచ్చన్ నోటి దురుసు..పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు

పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2025-12-03 06:29 GMT

Jaya Bachchan’s Harsh Remarks: బాలీవుడ్ సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు జయా బచ్చన్ పెళ్లి గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.వివాహం అనే వ్యవస్థ కాలం చెల్లిపోయిందని, ఆధునిక సంబంధాలకు చట్టబద్ధమైన ముద్ర (Legal Stamp) అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. "వివాహం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చట్టబద్ధమైన నిర్వచనాలు లేవు. నిర్వచించాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు మనుషులు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుండాలన్నదే ముఖ్యమైన విషయం" అని ఆమె నొక్కి చెప్పారు.

తన మనవరాలు నవ్య నవేలీ నందా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు. ముందుగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం.నేటి యువతరం పిల్లలు చాలా తెలివైన వారని, అన్ని విషయాల్లో పెద్దలను మించిపోయారని, అందుకే వారికి సలహా ఇవ్వడానికి తాను చాలా పాతదాన్ని అయ్యానని ఆమె ఒప్పుకున్నారు.

వివాహాన్ని ఆమె సరదాగా "ఢిల్లీ లడ్డూ"తో పోల్చారు.అది ఢిల్లీ లడ్డూ లాంటిది... తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే . జీవితాన్ని ఆస్వాదించండి."జయా బచ్చన్ 50 ఏళ్లకు పైగా అమితాబ్ బచ్చన్‌తో వైవాహిక జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, ఆమె ఈ వ్యాఖ్యలు నేటి యువతరం మారుతున్న ఆలోచనలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News