Shruti Haasan: అపర్ణా సేన్‌ను ఆకట్టుకోవడానికే కమల్ బెంగాలీ నేర్చుకున్నారు: శృతి హాసన్

కమల్ బెంగాలీ నేర్చుకున్నారు: శృతి హాసన్;

Update: 2025-08-26 16:40 GMT

Shruti Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ఆయన కుమార్తె, నటి శృతి హాసన్ ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. ప్రముఖ నటి, దర్శకురాలు అపర్ణా సేన్‌ను ఇంప్రెస్ చేయడానికే తన తండ్రి బెంగాలీ భాష నేర్చుకున్నారని ఆమె వెల్లడించారు. ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో శృతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఇంటర్వ్యూలో నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. కమల్ ఏదైనా విషయాన్ని చాలా వేగంగా నేర్చుకుంటారని, ఆయనకు బెంగాలీ కూడా తెలుసని ప్రస్తావించారు. వెంటనే శృతి హాసన్ జోక్యం చేసుకుని, తన తండ్రి ఆ భాష నేర్చుకోవడానికి గల అసలు కారణాన్ని వివరించారు.

అపర్ణా సేన్ అంటే కమల్‌కు అభిమానం

‘‘నాన్న బెంగాలీ ఎందుకు నేర్చుకున్నారంటే, దానికి కారణం అపర్ణా సేన్. ఆమె అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆమెను ఆకట్టుకోవడం కోసమే ఆయన ఆ భాష నేర్చుకున్నారు’’ అని శృతి తెలిపారు. అంతేకాకుండా కమల్ దర్శకత్వం వహించిన 'హేరామ్' సినిమాలో రాణీ ముఖర్జీ పోషించిన పాత్రకు అపర్ణ అనే పేరు పెట్టడం కూడా ఆమెపై ఉన్న అభిమానంతోనే అని శృతి పేర్కొన్నారు.

శృతి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీనిపై కమల్ అభిమానులు, నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. కమల్ గారి ప్రేమకథలు కూడా ఆయన సినిమాల్లాగే చాలా ఆసక్తికరంగా ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News