‘Kantara Chapter 1’: కాంతార చాప్టర్ 1 మరో సెన్సేషన్..

మరో సెన్సేషన్..

Update: 2025-10-23 04:19 GMT

‘Kantara Chapter 1’: కాంతార: చాప్టర్ 1' (Kantara: Chapter 1) ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఒరిజినల్ వెర్షన్ కంటే కొంచెం తక్కువ రన్‌టైమ్‌తో (2 గంటల 14 నిమిషాలు) వస్తోంది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం , మలయాళ భాషలలో అక్టోబర్ 2 న విడుదలైన సంగతి తెలిసిందే..ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల మార్కు వైపు దూసుకుపోతున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 717.50 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.

'కాంతార: చాప్టర్ 1 రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన, ప్రధాన పాత్ర పోషించిన కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం.ఇది 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'కాంతార'కి సంబంధించిన ప్రీక్వెల్ .మొదటి సినిమాలో చూపించిన భూత కోల ఆచారం, దైవాల (దైవ గణాలు-పంజూర్లి, గుళిగ) మూలాలు, రాజులు, అటవీ తెగల మధ్య జరిగే సంఘర్షణలను, ముఖ్యంగా బర్మ (Berme) అనే కథానాయకుడి ప్రయాణాన్ని చూపిస్తుంది.

Tags:    

Similar News