Karthi’s Movie Enters the Sankranti Race: సంక్రాంతి బరిలో కార్తీ మూవీ

కార్తీ మూవీ

Update: 2026-01-12 09:03 GMT

Karthi’s Movie Enters the Sankranti Race: తమిళ స్టార్ హీరో కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం "అన్నగారు వస్తారు" (తమిళంలో వా వాతియార్). ఈ సినిమాఈ సినిమా తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్‌గా విడుదలవుతోంది.

తెలుగులో ఈ సినిమాను "అన్నగారు వస్తారు" అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి పెద్ద సినిమాల (మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వారి చిత్రాలు) పోటీ ఎక్కువగా ఉండటం వల్ల, తెలుగు వెర్షన్ సంక్రాంతి తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.

ఈ సినిమా 70, 80వ దశకంలోని మాస్ కమర్షియల్ సినిమాలకు ట్రిబ్యూట్‌లా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో కార్తీ సీనియర్ ఎన్టీఆర్ (NTR) గారి వీరాభిమానిగా కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ గారి గెటప్‌లో కార్తీ కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. 'సూదు కవ్వం' ఫేమ్ నలన్ కుమారస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కార్తీ, కృతి శెట్టిలతో పాటు సత్యరాజ్, రాజ్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

నిజానికి ఈ సినిమా 2025 డిసెంబర్ 12నే విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా (స్టూడియో గ్రీన్) కొన్ని ఆర్థిక పరమైన సవాళ్లు , కోర్టు స్టే కారణంగా సినిమా విడుదలను జనవరికి వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Tags:    

Similar News