Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. సీబీఐ విచారణకు విజయ్
సీబీఐ విచారణకు విజయ్
Karur Stampede: తమిళ నటుడు తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి ఢిల్లీలోని సీబీఐ (CBI) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ ఈ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆయనను సుమారు ఏడు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. కరూర్ సభ నిర్వహణలో లోపాలు, జనాన్ని నియంత్రించడంలో విఫలం కావడం, విజయ్ రాకలో జరిగిన ఆలస్యం (సుమారు 7 గంటలు) వంటి అంశాలపై సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు.ఈ ప్రమాదానికి తన పార్టీ నేతలు కారణం కాదని, స్థానిక పోలీసులు , ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లలో విఫలమయ్యారని విజయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. గందరగోళం పెరగకూడదనే ఉద్దేశంతోనే తాను ఘటనా స్థలం నుండి త్వరగా వెళ్లిపోయానని ఆయన వివరించారు.సంక్రాంతి (పొంగల్) పండుగ దృష్ట్యా ఈరోజు (జనవరి 13) విచారణ నుండి ఆయన మినహాయింపు కోరారు. దీంతో అధికారులు మరో తేదీన మళ్లీ రావాల్సిందిగా సూచించారు.
సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రాజకీయ సభలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసుల విచారణ సరిగ్గా జరగడం లేదని భావించిన సుప్రీంకోర్టు, అక్టోబర్‌లో దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.