Katrina kaif: మాల్దీవుల బ్రాండ్ అంబాసిడర్ కత్రినా
బ్రాండ్ అంబాసిడర్ కత్రినా;
Katrina kaif: బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ మాల్దీవులకు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో స్పెషల్ సమ్మర్ సేల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అక్కడి టూరిజం సంస్థ.. ఇందులో భాగంగా కత్రినాను ఎంపిక చేసినట్టు తెలియజేసింది.
బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది కత్రినా కైఫ్. మాల్దీవులు అనేవి సహజసిద్ధమైన అందం, ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రదేశమని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులని పెంచేందుకు, వారికి అత్యుత్తమ అనుభవాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పింది కత్రినా.
ఆ మధ్య భారత పర్యాటకం, ప్రధాని మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. భారతీయులంతా మాల్దీవులను బహిష్కరించడంతో అక్కడ టూరిజం పతనమైంది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారత్‌తో సత్సంబంధాలకు ప్రయత్నిస్తోంది.