KBC’s New Season: కేబీసీకొత్త సీజన్ వస్తోంది..
కొత్త సీజన్ వస్తోంది..;
KBC’s New Season: దేశంలోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అయిన కౌన్ బనేగా క్ర్ర్పతి కొత్త సీజన్ రాబోతోంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ 16 సీజన్స్ తో సక్సెస్ ఫుల్ రన్ కాగా, తాజాగా 17వ సీజన్ ను అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆగస్టు 11 నుంచి టీవీలో ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీతో పాటు సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో పాల్గొనడానికి సాధారణంగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. భారతీయ పౌరసత్వం ఉండాలి.ఈ షోలో గరిష్టంగా రూ. 7 కోట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
షోకి ఎలా వెళ్లాలంటే.?
షో నిర్వాహకులు ప్రతి సీజన్‌కి ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో సాధారణంగా ఫోన్, SMS లేదా SonyLIV యాప్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకున్న వారిలో నుంచి, నిర్వాహకులు ఎంపిక చేసిన కొంతమందిని తదుపరి రౌండ్‌లకు ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ తర్వాత ఎంపికైన వారికి ఆడిషన్స్ నిర్వహిస్తారు. ఈ ఆడిషన్స్ లో క్విజ్, ఇంటర్వ్యూలు వంటివి ఉంటాయి. ఆడిషన్స్ నుంచి ఎంపికైన వారు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ లో పాల్గొంటారు. ఈ రౌండ్ లో వేగంగా సరైన సమాధానం ఇచ్చిన వారు హాట్ సీట్ లో కూర్చునే అవకాశం పొందుతారు.ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో విజేతలుగా నిలిచిన వారు అమితాబ్ బచ్చన్ తో నేరుగా ఆట ఆడుతారు.