Keerthy Suresh: కీర్తి సురేశ్ డబుల్ ప్యాకేజీ?

డబుల్ ప్యాకేజీ?;

Update: 2025-07-01 09:45 GMT

Keerthy Suresh:  టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో అలరించేందుకు రెడీ అయ్యింది మహానటి కీర్తి సురేశ్. తాజాగా ఈ భామ నటించిన 'ఉప్పు కప్పురంబు' చిత్రం జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు డేట్ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం, కీర్తి చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ కాగా.. మరోటి వేణు డైరెక్ట్ చేస్తు న్న ఎల్లమ్మ. వీటిల్లో ఈ అమ్మడికి మంచి రోల్ దక్కినట్టు తెలు స్తోంది. అంతేకాదు ఈ రెండు సినిమాలకు కలిపి ఈ బ్యూటీభారీ రెమ్యునరేషన్ అందుకుంటుం దని సమాచారం. ఒకే బ్యానర్ లో వస్తున్న ఈ మూవీలకు సంబంధించి కీర్తి సురేశ్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డబుల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టు టాక్. సో అటు సినిమాల పరంగా సంతృప్తితో పాటుగా ఇటు రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉందంట మహానటి . ఇక ఈ రెండు చిత్రాలు కీర్తికి సూపర్ ట్రీట్ అందిస్తాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News