Kiara Advani: ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియరా
జన్మనిచ్చిన కియరా;
By : PolitEnt Media
Update: 2025-07-16 08:22 GMT
Kiara Advani: బాలీవుడ్ నటి కియరా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో నిన్న బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
కియరా 2023లో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక చాలా ఘనంగా జరిగింది.షేర్షా సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు.
కియరా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ,గేమ్ చేంజర్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తోంది. డాన్ 3 వంటి కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి గర్భం కారణంగా తప్పుకున్నట్లు కూడా సమాచారం.