Trending News

Kriti Shetty Bags a Mega Offer: మెగా ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి.. చిరు సినిమాలో కీలక పాత్ర..?

చిరు సినిమాలో కీలక పాత్ర..?

Update: 2026-01-21 17:08 GMT

Kriti Shetty Bags a Mega Offer: సినిమా రంగంలో ఒక హిట్ అందుకోవడం కంటే ఆ సక్సెస్‌ను కాపాడుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడమే అసలైన సవాల్. ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, ఆ తర్వాత వరుస ప్రాజెక్టులు చేసినా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పే ఒక మెగా అవకాశం తలుపు తట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిరు కుమార్తెగా బేబమ్మ?

బ్లాక్‌బస్టర్ హిట్‌లతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కృతి శెట్టికి ఒక కీలక పాత్ర లభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాదు ఆయన కూతురు పాత్రలో కనిపించనుందని సమాచారం.

తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ కథ

ఈ మూవీ పూర్తిగా బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు టాక్. చిరుకు జోడీగా ప్రియమణిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మార్చి నుంచి పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్

ఈ నెలాఖరులోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఫిలిం నగర్ సమాచారం. ఒకవేళ ఈ మెగా ప్రాజెక్టులో కృతి శెట్టి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కితే, అది ఆమె కెరీర్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడం ఖాయం.

Tags:    

Similar News