Hebbah Patel: లాల్ స్టైలింగ్.. హెబ్బా పటేల్ అదిరిపోయే ఫిక్స్

హెబ్బా పటేల్ అదిరిపోయే ఫిక్స్;

Update: 2025-07-05 16:00 GMT

Hebbah Patel: హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్ష కులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'అలా ఎలా ' చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కుమారి 21 ఎఫ్ తో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావ్ చిన్న, వాడా, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ వంటి హిట్ చిత్రాలు చేసింది. ఈ క్రమంలో చేసిన 24 కిస్సెస్ మూవీ హెబ్బా ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసింది. అయి నప్పటికీ ఒరేయ్ బుజ్జిగా, తెలిసినవాళ్లు, అలా నిన్ను చేరి, హనీమూన్ ఎక్స్ ప్రెస్ వంటి అడపాదడపా మూవీలు చేస్తూనే ఉంది. తాజాగా ఈబ్యూటీ 'శక్తిమతి' ప్రా జెక్ట్ లో బిజీగా ఉంది. డి. రామకృష్ణ తెరకెక్కిస్తున్న ఈమూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ల్ చేస్తు న్నారు. వీఎఫ్ ఎక్స్ ఆధారిత సన్నివేశాలతో కూడిన ఈ పీరియా డిక్ థ్రిల్లర్లో హెబ్బా పటేల్ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. అయితే సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తుంది హెబ్బా. లేటెస్టుగా ట్రెడిషనల్ శారీలో కనిపించి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. అభరణాలు, ఎరుపు చీర, చెవిపోగు లు, బంగారు ఎంబ్రా యిడరీతో మరింత అందంగా మెరిసిపో తుంది. మనోహరమైన వ్యక్తిత్వం, సహజ సౌం దర్యంతో ప్రశంసలు అందుకుంటోంది. ఈఫొటోలకు 'లాల్ స్టైలింగ్' క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News