Siddhu Jonnalagadda: ఈ నెల 25 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో - సిద్దు జొన్నలగడ్డ
పరిస్థితి ఎలా ఉంటుందో - సిద్దు జొన్నలగడ్డ
Siddhu Jonnalagadda: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం తాను ఎంతగా ఎదురుచూస్తున్నానో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయదశమి కానుకగా ఈ నెల 25న విడుదల కానున్న ఓజీ కోసం ఆగడం కష్టంగా ఉందని సిద్దు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. "ఓజీ హైప్‌కి హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకూ మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత పరిస్థితి ఏంటో. పవన్ కల్యాణ్.. యే పవన్ నహీ.. ఆంధీ హై" అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సినిమాపై ఉన్న ఉత్కంఠను స్పష్టం చేస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఓజీ హవా
ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ తెలంగాణలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడైపోతున్నాయి. ఈ స్పందన సినిమాపై ఉన్న భారీ అంచనాలకు నిదర్శనం. అభిమానులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. *సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.