Mahavatar Narasimha movie: ఈ సినిమా పవన్ కళ్యాణ్ చూడాలి

పవన్ కళ్యాణ్ చూడాలి

Update: 2025-08-04 10:14 GMT

Mahavatar Narasimha movie: మహావతార్ నరసింహా సినిమా జులై 25న విడుదలై కలెక్షన్లలో దూసుకుపోతోంది. అత్యధిక కలెక్షన్లు వచ్చిన యానిమేషన్ మూవీగా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ చేసినప్పటి నుంచి పాజిటివ్ టాక్ వస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తాను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయచడం నరసింహ స్వామి అనుగ్రహంగా భావిస్తున్నానని చెప్పారు అరవింద్.

సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు ఉన్న అవగాహన అసాధారణమైనదని ప్రశంసించారు. తన కుటుంబంలో సనతాన ధర్మ గురించి పవన్ కళ్యాణ్‌కి ఉన్నంత లోతైన జ్ఞానం మరెవరికీ లేదని అల్లు అరవింద్ అన్నారు.ఈ సినిమా పవన్ కళ్యాణ్ చూడాలని కోరారు.

అల్లు అరవింద్ 'మహావతార్ నరసింహా' సినిమాను తన నిర్మాణ సంస్థ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో విడుదల చేశారు. తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. గతంలో 'కాంతార', '2018' వంటి ఇతర భాషా చిత్రాలను కూడా తెలుగులో విడుదల చేసి అల్లు అరవింద్ విజయం సాధించారు. ఈ జాబితాలో మహావతార్ నరసింహా కూడా చేరింది.

ఈ యానిమేషన్ సినిమాను హోంబలే ఫిల్మ్స్ (KGF, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ) నిర్మించింది.శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం, భక్త ప్రహ్లాదుడి కథ ఆధారంగా ఈ 3D యానిమేషన్ సినిమా రూపొందింది.

Tags:    

Similar News