Malaika Arora: మాజీ ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్
విషెస్ చెప్పిన హీరోయిన్
Malaika Arora: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ 41 ఏండ్లలోకి అడుగుపెట్టాడు. నిన్న జూన్ 26న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా కరణ్ జోహార్, కరీనా కపూర్ ఖాన్, భూమి పె డ్నేకర్ సహా పలువురు ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి అర్జున్ కపూర్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష లు తెలిపారు. బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మాజీ ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో, మలైకా ఒక అందమైన బూమరాంగ్ వీడియోను అప్లోడ్ చేసింది, అక్కడ అర్జున్ కపూర్ తెల్లటి చొక్కా నల్ల ప్యాంటులో కనిపిస్తాడు. షాంపైన్ గ్లాసెస్ ఎమోజితో పాటు "హ్యాపీ బర్త్ డే అని రాసింది. మలైకా, అర్జున్ 2018 నుంచి దాదాపు ఆరేండ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత విడిపోయారు. వీళ్లిద్దరూ విడిపో యిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తక్కువగా టచ్ లో ఉంటున్నారు. ఈ పోస్ట్ ను చూసిన అభిమానులు లైక్ లో తమ సపోర్ట్ ను వెల్లడిస్తున్నారు.