Malayalam young actor Akhil Viswanath: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ యువ నటుడు ఆత్మహత్య..
ప్రముఖ యువ నటుడు ఆత్మహత్య..
Malayalam young actor Akhil Viswanath: మలయాళ యువ నటుడు అఖిల్ విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 11న కేరళలోని త్రిస్సూర్ జిల్లా, కొడాలిలోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
అఖిల్ విశ్వనాథ్ తన ఇంట్లోని గదిలో ఉరివేసుకుని కనిపించారు. ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయన తల్లి గీత మృతదేహాన్ని గుర్తించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
2019లో కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న 'చోళ' (Chola) చిత్రంలో ప్రేమికుడి పాత్రతో అఖిల్ విశ్వనాథ్ మంచి గుర్తింపు పొందారు.ఆయన 'ఆపరేషన్ జావా' వంటి ఇతర ప్రముఖ చిత్రాలలో కూడా నటించారు.
అఖిల్ నటనతో పాటు, కొడాలిలో ఒక మొబైల్ షాపులో మెకానిక్‌గా కూడా పనిచేసేవారు. అయితే, కొంతకాలంగా ఆయన పనికి వెళ్లడం లేదని తెలుస్తోంది.ఇటీవల మూడు నెలల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితులు అఖిల్‌పై మానసిక ఒత్తిడిని పెంచి ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.ఆయన మరణం మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతిని కలిగించింది. దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేశారు.