Manya Anand Accuses Dhanush’s Manager: కమిట్‌మెంట్ ఇస్తే సినిమా ఇస్తానన్నాడు.. ధనుష్ మేనేజర్‌పై మాన్య ఆనంద్ ఆరోపణలు

ధనుష్ మేనేజర్‌పై మాన్య ఆనంద్ ఆరోపణలు

Update: 2025-11-19 06:08 GMT

Manya Anand Accuses Dhanush’s Manager: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనేజర్ అయిన శ్రేయాస్ తనను కాస్టింగ్ కౌచ్ ద్వారా వేధించడానికి ప్రయత్నించాడని టీవీ నటి మాన్య ఆనంద్ సంచలన ఆరోపణలు చేసింది. నూతన సినిమా ప్రాజెక్ట్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, మేనేజర్ శ్రేయాస్ తనను కమిట్‌మెంట్అడిగాడని మాన్య ఆనంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఎలాంటి కమిట్‌మెంట్? నేను ఎందుకు కమిట్‌మెంట్ ఇవ్వాలి? అని ప్రశ్నించి, తాను అలాంటి ప్రతిపాదనలకు అంగీకరించబోనని ఆమె స్పష్టం చేసింది. తాను తిరస్కరించినప్పటికీ, శ్రేయాస్ పదేపదే తనను సంప్రదించారని, ధనుష్ సార్ అడిగినా కూడా మీరు అంగీకరించరా? అని కూడా అడిగాడని మాన్య ఆనంద్ పేర్కొంది. శ్రేయాస్.. ధనుష్ నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ ఆఫీసు అడ్రస్ పంపి, కలవమని కోరాడని, స్క్రిప్ట్‌లు కూడా పంపాడని, కానీ తాను వాటిని చదవలేదని మాన్య తెలిపింది. "మేము నటులం, మా పని నటించడం. పని ఇవ్వండి, కానీ ప్రతిఫలంగా వేరేమీ ఆశించవద్దు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై ధనుష్ కానీ, మేనేజర్ శ్రేయాస్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే గతంలో తన పేరు మీద ఫేక్ కాస్టింగ్ కాల్స్ వస్తున్నాయని శ్రేయాస్ ఒక ప్రకటన చేసిన విషయం గమనార్హం.ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశాన్ని చర్చనీయాంశం చేసింది.

Tags:    

Similar News