Bhagya Shree Borse Drops a Hint: పెళ్లిపై పుకార్లు..హింట్ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే

హింట్ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే

Update: 2025-11-19 06:05 GMT

Bhagya Shree Borse Drops a Hint: నటి భాగ్యశ్రీ బోర్సే పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమెను 'లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా' అని అడిగినప్పుడు, ఆమె ఎక్కువగా లవ్ మ్యారేజ్ వైపు మొగ్గు చూపుతానని (లేదా కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని) చెప్పారు. మొత్తంగా భాగ్యశ్రీ బోర్సే తనకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నిచంగా లేదంటోంది. ప్రేమలో లేకుండానే మీరు ప్రేమ వివాహం చేసుకుంటారని ఎలా చెబుతున్నారంటూ ప్రశ్నించగా, తనకు ప్రేమ మీద విశ్వాసం ఎక్కువని, అందుకే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. లవ్ మ్యారేజ్ ఎప్పడు, ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కన్ఫర్మ్ గా తాను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది.

ప్రస్తుతం భాగ్యశ్రీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిని బట్టి చూస్తే భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే లవ్ లో ఉండేమో అని కొందరు. కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ లో బిజీగా ఉన్న కారణంగా ప్రేమ విషయాన్ని దాస్తున్న భాగ్యశ్రీ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉంది. ఒక అమ్మాయి ప్రేమలో అప్పటికే ఉంటే తప్ప తాను ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పదని కొందరంటున్నారు.

Tags:    

Similar News