Mass Jathara on OTT: ఓటీటీలోకి మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Mass Jathara on OTT: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఓ శుభవార్త! ఆయన హీరోగా, దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. పెద్ద అంచనాల మధ్య విడుదలైన మాస్ జాతర థియేటర్లలో సందడి చేసిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రవితేజ తనదైన మాస్ ఎనర్జీతో నటించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.నవీన్ చంద్ర విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.
రాజేంద్ర ప్రసాద్ రవితేజ తాత పాత్ర పోషించారు. హైపర్ ఆది, అజయ్ ఘోష్ వంటి నటులు కామెడీని పండించే ప్రయత్నం చేశారు. థియేటర్‌లో సినిమాను మిస్ అయిన వారు, అలాగే రవితేజ మాస్ యాక్షన్‌ను మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్‌కు నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో రవితేజ తనదైన మార్క్ కామెడీ, ఎనర్జిటిక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు హుషారైన స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్ర రైల్వే ఎస్సైగా కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు భాను భోగవరపు, రవితేజ అభిమానులు మెచ్చేలా యాక్షన్ కొరియోగ్రఫీని, మాస్ ఎలివేషన్లను బాగా చూపించే ప్రయత్నం చేశారు.
లక్ష్మణ్ భేరీ నిజాయితీపరుడు కావడంతో, అన్యాయం జరిగితే తన పరిధి కాకపోయినా జోక్యం చేసుకుంటాడు. ఈ కారణంగా తరచూ బదిలీలకు గురవుతుంటాడు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలోని అడవివరం అనే ప్రాంతానికి బదిలీ అవుతాడు. అక్కడ శివుడు (నవీన్ చంద్ర) అనే దుర్మార్గుడైన డ్రగ్ లార్డ్ గంజాయిని పండిస్తూ, అక్రమ రవాణా చేస్తుంటాడు. శివుడి గంజాయి సామ్రాజ్యాన్ని అడ్డుకునే క్రమంలో, భారీ మొత్తంలో ఉన్న గంజాయి లోడ్‌ను లక్ష్మణ్ మాయం చేస్తాడు. ఆ తర్వాత ఆ లోడ్ ఏమైంది? శివుడితో లక్ష్మణ్ ఎలా పోరాడాడు? అనేదే ఈ సినిమా కథ.