‘Raja Saab’:బాక్సాఫీస్ వద్ద 'రాజా సాబ్' ఊచకోత: తొలి రోజే 112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
తొలి రోజే 112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
‘Raja Saab’:సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' అధికారికంగా ధృవీకరించింది. ఒక హారర్ ఫాంటసీ జోనర్ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం భారతీయ చిత్ర చరిత్రలోనే ఇదే తొలిసారి.
ఈ సినిమాతో ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఆరో సినిమాగా 'రాజా సాబ్' రికార్డులకెక్కింది. గతంలో బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, మరియు కల్కి 2898 AD చిత్రాలు ఈ ఫీట్‌ను సాధించగా, ఇప్పుడు రాజా సాబ్ కూడా ఆ జాబితాలో చేరింది. తద్వారా ఆరు సినిమాలకు వంద కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా ప్రభాస్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నైజాం (తెలంగాణ) ఏరియాలోనే మొదటి రోజు దాదాపు 23 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. సీడెడ్, మిగిలిన ఆంధ్రా ప్రాంతాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో సైతం ప్రిమియర్ షోల నుండే మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరి ప్రభాస్ తన గ్లోబల్ మార్కెట్ సత్తాను చాటారు.
సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి అభిమానులకు ఒక తీపి కబురు అందించారు. థియేటర్లలో ఉన్న వెర్షన్‌కు అదనంగా మరో 8 నిమిషాల కొత్త సన్నివేశాలను (ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్) నేటి సాయంత్రం నుండి జోడిస్తున్నట్లు ప్రకటించారు. పండుగ సెలవులు ప్రారంభం కానుండటంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.