Mass Jathara: మాస్ జాతర దీపావళికి షిఫ్ట్.!
దీపావళికి షిఫ్ట్.!;
Mass Jathara: మాస్ రాజా రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'మాస్ జాతర' సినిమా దీపావళికి విడుదల కాబోతుందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఈ సినిమాను మొదట వినాయక చవితి కానుకగా ఆగస్టు 27 విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇటీవలే టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిచిపోవడం, ఇంకా కొన్ని ప్యాచ్ వర్క్‌లు మిగిలి ఉండటం వల్ల విడుదల వాయిదా పడుతున్నట్లు సమాచారం.
కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా పంపిణీ విషయంలో వెనకడుగు వేస్తున్నారని, అందుకే నిర్మాతలు కొంత గ్యాప్ తీసుకుని సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, అక్టోబర్‌లో దీపావళి పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆ సమయంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. దర్శకుడు భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ, శ్రీలీల. 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.