Meghalaya Honeymoon Murder Case: సినిమాగా మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసు

హనీమూన్ మర్డర్ కేసు;

Update: 2025-07-30 12:00 GMT

Meghalaya Honeymoon Murder Case: నిజ జీవిత సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కాయి. ముఖ్యంగా ఏదైనా షాకింగ్ సంఘటన జరిగితే, దానిపై సినిమా తీయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల, మేఘాలయలోని షిల్లాంగ్‌లో హనీమూన్ కోసం వచ్చిన ఒక జంటలో.. భర్త హత్యకు గురయ్యాడు. తరువాత అతని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడు ఈ సంఘటన సినిమాగా రూపొందుతోంది.

ఎస్పీ నింబావత్ 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' అనే బాలీవుడ్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ కథ రాజా రఘువంశీ హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయింది. 80శాతం షూటింగ్ ఇండోర్‌లో జరుగుతుంది. మిగిలిన 20 శాతం షూటింగ్ మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సమయంలో నటీనటుల గురించి దర్శకుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ సినిమా చేయడానికి రాజా రఘువంశీ సోదరుడు సచిన్ రఘువంశీ పూర్తి సహకారం అందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ‘‘ఈ సినిమా తీయడానికి పూర్తిగా సపోర్ట్‌‌గా ఉంటాను. నా తమ్ముడి హత్య కేసు తెరపైకి రాకపోతే, ఎవరది తప్పు అని ప్రజలకు తెలియదు. హత్యకు దారితీసిన సంఘటనలపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రజలకు నిజాలు చూపిస్తుంది’’ అని రాజారఘువంశీ సోదరుడు అని సచిన్ అన్నారు.

Tags:    

Similar News