Allu Arjun Praises Kantara Chapter 1: మైండ్ బ్లోయింగ్ మూవీ .. కాంతార చాప్టర్ 1పై అల్లు అర్జున్ ప్రశంసలు
కాంతార చాప్టర్ 1పై అల్లు అర్జున్ ప్రశంసలు
Allu Arjun Praises Kantara Chapter 1: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార: చాప్టర్ 1' సినిమాపై ప్రశంసలను కురిపించారు.ఆయన ఈ చిత్రాన్ని "మైండ్ బ్లోయింగ్ (Mind-blowing)" ఫిల్మ్‌గా అభివర్ణించారు.సినిమా చూస్తున్నంత సేపు తాను ఒక "ట్రాన్స్" (Trans) లోకి వెళ్లినట్లు అనిపించిందన్నారు. దర్శకత్వం, రచన, నటనలో "వన్-మ్యాన్ షో" చూపించిన రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయన అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించారని కొనియాడారు. సినిమాలోని ఇతర నటీనటులు (రుక్మిణి వసంత, జయరామ్, గుల్షన్ దేవయ్య) , సాంకేతిక నిపుణులైన సంగీత దర్శకుడు (అజనీష్ లోక్‌నాథ్), సినిమాటోగ్రాఫర్ (అరవింద్ ఎస్. కశ్యప్), ఆర్ట్ డైరెక్టర్, స్టంట్స్ టీమ్‌ను కూడా మెచ్చుకున్నారు.ఈ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అక్టోబర్ 2, న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచినట్లుగా తెలుస్తోంది.ఇది 2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్. దీని వసూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నందున ఫైనల్ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.