Modi Biopic: పాన్ ఇండియా మూవీగా మోదీ బయోపిక్..హీరో ఎవరంటే.?

హీరో ఎవరంటే.?

Update: 2025-09-17 12:42 GMT

Modi Biopic: ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్బంగా ఆయన జీవితంపై తెరకెక్కనున్న ఒక బయోపిక్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్ .ఈ చిత్రం మోడీ జీవిత ప్రయాణాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని, అలాగే వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెరపై చూపించనుంది. ఇది గతంలో వచ్చిన "పీఎం నరేంద్ర మోడీ" తర్వాత మోడీపై వస్తున్న రెండో బయోపిక్.

మా వందే" అనే టైటిల్ మోడీ తన తల్లి హీరాబెన్ మోడీపై చూపించే ప్రేమ, గౌరవాన్ని సూచిస్తుంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది" అనే క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు, ఇది మదర్ సెంటిమెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సూచిస్తుంది.

ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఈయన తెలుగులో "జనతా గ్యారేజ్", "భాగమతి" వంటి సినిమాలతో సుపరిచితుడు.సీహెచ్ క్రాంతి కుమార్ డైరెక్షన్ లో నిర్మాత వీర్ రెడ్డి ఎం. (సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై) ఈ సినిమా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ("కేజీఎఫ్", "సలార్" ఫేమ్) మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఆంగ్ల భాషలో కూడా పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

Tags:    

Similar News