Modi's Birthday: మోడీ బర్త్ డే.. ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నాగార్జున

ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నాగార్జున

Update: 2025-09-17 12:10 GMT

Modi's Birthday: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2014లో మోదీతో జరిగిన తన తొలి భేటీలోని అనుభవాలను నాగార్జున ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. 2014లో గాంధీనగర్‌లో మోదీని మొదటిసారి కలిసినప్పుడు, ఆయన ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించి తనను ఆశ్చర్యపరిచారని నాగార్జున తెలిపారు. "నా స్నేహితుల పిల్లలు మిమ్మల్ని ఫోటో అడిగినప్పుడు, మీరు ఎంతో ఆప్యాయంగా దగ్గరకు పిలిచి ఫోటో దిగారని వాళ్లు నాతో చెప్పారు. మీ చుట్టూ భద్రత ఉన్నా మీరు అలా చేయడం వాళ్లకు బాగా నచ్చింది" అని మోదీ అన్నారని నాగార్జున గుర్తు చేసుకున్నారు.

అప్పుడు మోదీ తనకు "మీలో ఉన్న ఆ వినయాన్ని, సహానుభూతిని ఎప్పటికీ వదులుకోవద్దు. మనిషికి అవి చాలా ముఖ్యం" అని సలహా ఇచ్చారని నాగార్జున తెలిపారు. ఆ చిన్న విషయాన్ని కూడా మోదీ గుర్తుపెట్టుకుని చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

మోదీని ప్రశంసించిన నాగార్జున:

తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయనను గుర్తు చేసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగార్జున అన్నారు. దేశం కోసం మోదీ తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారని ప్రశంసించారు.

Tags:    

Similar News