Shilpa Shetty in Cheating Case: చీటింగ్ కేసులో.. శిల్పాశెట్టిని 4 గంటలు విచారించిన ముంబై పోలీసులు
శిల్పాశెట్టిని 4 గంటలు విచారించిన ముంబై పోలీసులు
Shilpa Shetty in Cheating Case: బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్ల మేర చీటింగ్ చేశారంటూ శిల్ప శెట్టి. ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మొన్న రాజ్ కుంద్రాను పోలీసులు విచారించారు. తాజాగా హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరైంది. ఆమెను పోలీసులు నాలుగు గంటల పాటు విచారించారు. తీసుకున్న డబ్బులు ఏం చేశారు. ఎక్కడ ఇన్వెస్ట్ మెంట్ చేశారు అనే కోణంలో విచారణ సాగింది. ఈ విషయంపై ఇప్పటి వరకు శిల్పాశెట్టి స్పందించలేదు. శిల్పాశెట్టి దంపతులు దేశం విడిచి వెళ్లకుం డా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శల పాలు అవుతోంది. కానీ రీసెంట్ గా శిల్పాశెట్టి దంపతులు థాయ్ లాండ్ టూర్ కు వెళ్లేందుకు పర్మిషన్ అడగగా కోర్టు తిరస్కరించింది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న శిల్పాశెట్టి వ్యక్తిగతంగా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శల పాలవుతోంది.