Murderous Beauty at the White House: వైట్‌హౌస్‌లో మర్డర్ బ్యూటీ: అమెరికా అధ్యక్షుడి విందులో మల్లికా షెరావత్
అమెరికా అధ్యక్షుడి విందులో మల్లికా షెరావత్
Murderous Beauty at the White House: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె ప్రత్యేక అతిథిగా మెరిశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యమిచ్చిన ఈ వేడుకకు మల్లికకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ వేడుకలో పాల్గొనడం తనకి దక్కిన గొప్ప గౌరవమని, ఇది మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇచ్చిందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
వైట్‌హౌస్‌లో అందంగా అలంకరించిన క్రిస్మస్ చెట్ల వద్ద దిగిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రేక్షకుల్లో మల్లిక కూడా ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రెండోసారి ఆహ్వానం.. ఒక అరుదైన రికార్డు
వైట్‌హౌస్ నుంచి మల్లికా షెరావత్‌కు ఆహ్వానం అందడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2011లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆమె హాజరయ్యారు. అప్పట్లో ఆమె నటించిన పాలిటిక్స్ ఆఫ్ లవ్ చిత్రానికి గుర్తింపుగా ఆ ఆహ్వానం అందింది.
మర్డర్'సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మల్లిక, ఆ తర్వాత హిస్స్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టులతో గ్లోబల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రాజ్‌కుమార్ రావ్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో వచ్చిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రంతో ఆమె మళ్ళీ వెండితెరపై పలకరించారు.