Murugadoss Reveals: ఆ హీరో రాత్రి 8 గంటలకు షూటింగ్‌కు వచ్చేవారు - మురుగదాస్
8 గంటలకు షూటింగ్‌కు వచ్చేవారు - మురుగదాస్;
Murugadoss Reveals: తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడుగా పేరుపొందిన మురుగదాస్ తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో షూటింగ్ టైమింగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు శంకర్ తర్వాత కోలీవుడ్‌లో అత్యంత ఎక్కువగా వినిపించిన పేరు మురుగదాస్‌దే. అయితే, ఏ హీరోపైనా ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయని మురుగదాస్, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక బాలీవుడ్ హీరో తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి 8 గంటలకు షూటింగ్‌కు..
ఆ బాలీవుడ్ హీరో రాత్రి 8 గంటలకు షూటింగ్‌కు వచ్చేవారు. పగటిపూట చిత్రీకరించాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వేళలో తీయాల్సి వచ్చేది. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది’’ అని మురుగదాస్ తెలిపారు. ఆ హీరో టైమింగ్స్ వల్ల పిల్లల సన్నివేశాలు చిత్రీకరించడం చాలా కష్టమైందని, రాత్రి సమయానికి పిల్లలు చాలా అలసిపోయేవారని ఆయన చెప్పారు. ‘‘ఆ హీరో టైమింగ్స్ కారణంగా ఆయనతో కలిసి పని చేయడం అంత సులువు కాదనిపించింది’’ అని మురుగదాస్ తెలిపారు.
తాజాగా మురుగదాస్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సికందర్ అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ వ్యాఖ్యలు సల్మాన్‌ను ఉద్దేశించే చేశారని బీ-టౌన్ లో చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.