Naagin Beauty Mouni Roy: చిరుతో చిందేసిన నాగిని బ్యూటీ మౌనిరాయ్

నాగిని బ్యూటీ మౌనిరాయ్;

Update: 2025-07-31 06:25 GMT

బాలీవుడ్ నటి మౌని రాయ్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న తాజా చిత్రం విశ్వంభరలో ఓ స్పెషల్ సాంగ్ లో చిందేసింది. స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫి చేసిన ఈ పాటతో సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సాంగ్ షూట్ లో మౌనిరాయ్ చిరంజీవితో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

ఈ సాంగ్ లో మౌని రాయ్ చిరంజీవితో కలిసి అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. మౌని రాయ్ గతంలో కన్నడ చిత్రం K.G.F: చాప్టర్ 1లో 'గలీ గలీ' అనే పాటలో కనిపించి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు విశ్వంభర ద్వారా ఆమె తెలుగు సినిమాలో అడుగుపెడుతున్నారు.

చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2025 దసరా పండుగ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News