‘Naari Naari Naduma Murari’ to Release on OTT: అతి త్వరలోనే ఓటీటీలోకి 'నారీ నారీ నడుమ మురారి'
ఓటీటీలోకి 'నారీ నారీ నడుమ మురారి'
‘Naari Naari Naduma Murari’ to Release on OTT: థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి' అతి త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో, తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ 'గౌతమ్' అనే పాత్రలో నటించారు. సాక్షి వైద్య (నిత్య), సంయుక్త మీనన్ (దియా) ఇద్దరు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో, వారిద్దరి మధ్య నలిగిపోయే హీరో పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. నరేష్, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ కామెడీ నటులు ఉండటంతో సినిమా అంతా ఫుల్ ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం 21 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం 4 నుంచి 6 వారాల గ్యాప్ ఉంటుంది. కానీ, ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు ముందుగానే స్ట్రీమింగ్‌కు మొగ్గు చూపారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2026 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.