National Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్..మమ్ముట్టికి పద్మభూషణ్
మమ్ముట్టికి పద్మభూషణ్
National Awards: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర,మలయాళ నటుడు మమ్ముట్టిలకు కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ,మమ్ముట్టికి పద్మభూషణ్ ప్రకటించింది. ధర్మేంద్రకు పద్మ విభూషన్ ను మరణానంతరం (Posthumously) ప్రకటించారు.
ధర్మేంద్ర గత ఏడాది నవంబర్ 24 తన 89వ ఏట కన్నుమూశారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది. ఈ ఏడాది మొత్తం 5 మందికి పద్మ విభూషణ్ లభించగా, అందులో ధర్మేంద్ర ఒకరు.ఈ అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన భార్య, నటి హేమమాలిని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ధరమ్ జీ సినీ ప్రస్థానాన్ని గుర్తించినందుకు చాలా గర్వంగా ఉంది" అని ఎమోషనల్ అయ్యారు.ఆయనకు గతంలో 2012లో పద్మ భూషణ్ అవార్డు కూడా లభించింది.
దక్షిణాది సినిమాల్లో, ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో దాదాపు 5 దశాబ్దాలుగా అలరిస్తున్న మమ్ముట్టికి దేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ లభించింది. ఆయనకు గతంలోనే 1998 లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందజేసింది.సుమారు 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయనకు 'పద్మ భూషణ్' గౌరవం దక్కింది.
దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్‌లో 400 కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, ఇప్పటివరకు 3 జాతీయ అవార్డులను (National Awards) ఉత్తమ నటుడిగా గెలుచుకున్నారు. ఈ ఏడాది కళల విభాగంలో పద్మ భూషణ్ పొందిన అతికొద్ది మంది సినీ ప్రముఖులలో మమ్ముట్టి ఒకరు. ఆయనతో పాటు ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ కు కూడా పద్మ భూషణ్ లభించింది.మమ్ముట్టి ప్రస్తుతం 'బ్రాహ్మయుగం', 'కాథల్' వంటి విభిన్నమైన సినిమాలతో యువ నటులకు పోటీనిస్తూ దూసుకుపోతున్నారు.