National Crush Rashmika: నేషనల్ క్రష్ రష్మిక.. 9 ఏళ్లలో 25 సినిమాలు..

9 ఏళ్లలో 25 సినిమాలు..

Update: 2025-10-27 04:23 GMT

National Crush Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీలో తన అద్భుత ప్రయాణంలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.రష్మిక మందన్న మొదటి కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' (Kirik Party), ఇది 2016లో విడుదలైంది. ఆ తేదీ నుంచి లెక్కిస్తే, ఆమె సినీ ప్రయాణం అక్టోబర్ 2025 నాటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల ప్రయాణంలో మొదటి చిత్రం కిరిక్ పార్టీ' (కన్నడ - 2016), తొలి తెలుగు చిత్రం 'ఛలో' (2018), పుష్ప ది రైజ్' (2021), యానిమల్' (2023), పుష్ప ది రూల్ 2024 వంటి సినిమాలతో ఆమె పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఈ 9 ఏళ్లలో ఆమె కన్నడ, తెలుగు, తమిళం, హిందీతో సహా 4 భాషల్లో సుమారు 25 చిత్రాల్లో నటించారు.ఆమె తన అందం, నటన, చురుకైన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ 'క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘మైసా’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తున్న రష్మిక హిందీలో ‘కాక్‌‌టైల్‌‌’ మూవీ చేస్తోంది.

Tags:    

Similar News