Nayanthara: న్యాయపరమైన చిక్కుల్లో నయనతార.. మద్రాస్ హైకోర్టు నోటీసులు
మద్రాస్ హైకోర్టు నోటీసులు
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన వీడియో క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు
ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలైన ‘చంద్రముఖి’, ‘నాన్ రౌడీ ధాన్’లకు సంబంధించిన క్లిప్పులను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆ చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు. దీంతో చంద్రముఖి నిర్మాణ సంస్థం ఏపీ ఇంటర్నేషనల్, ‘నాన్ రౌడీ ధాన్’ చిత్ర నిర్మాత అయిన నటుడు ధనుష్‌కు చెందిన నిర్మాణ సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.
ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నోటీసులపై నయనతార, నెట్‌ఫ్లిక్స్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.