Nidhi Agarwal: నాకు తెలుగు వాళ్లంటే ఇష్టం

తెలుగు వాళ్లంటే ఇష్టం;

Update: 2025-07-16 08:18 GMT

Nidhi Agarwal:  రూమర్స్ ను పట్టించుకోకుండా శ్రద్ధగా పనిచేసుకుంటూ వెళ్లాళంటోంది నిధి అగర్వాల్. పవన్తో 'హరిహర వీర ముల్లు', ప్రభాస్ 'ది రాజాసాబ్' తో ఈ ఏడాది ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుందీ భామ. హరిహర వీరమ ల్లు ఈ నెల 24న రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిధి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా .. తెలుగు ప్రేక్షకులంటే తనకెంతో ఇష్టమంటోంది. "హరిహర వీరమల్లు సినిమా ఓ విజువల్ వండర్.. ఏఎం రత్నం ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మించారని చెప్పింది. ఆయన ఈ సినిమా విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారని చెప్పింది. తాను ట్రైలర్ ఎన్నిసార్లు చూశానో లెక్కేలే దంటోన్న ఈ అమ్మడు ఈ సినిమా ప్రారంభంలో ఎన్నో రూమర్స్ వచ్చాయని చెప్పింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాటన్నిటికీ చెక్ పడిందని.. మనం ఓ పనిచేస్తున్నప్పుడు ఎన్నో కామెంట్స్ వినిపిస్తాయ ని, వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేయాలని అంటోంది. మొదట బాలేదు అన్న ప్రేక్షకులే వెంటనే చాలా బాగుంది అనటం సహజమని చెప్పింది.

Tags:    

Similar News