Nivetha Pethuraj: త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబంలో నివేదా పేతురాజ్

నివేదా పేతురాజ్

Update: 2026-05-23 07:12 GMT

Nivetha Pethuraj: టాలీవుడ్ లక్కీ బ్యూటీ నివేదా పేతురాజ్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతోంది! 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'రెడ్' లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా విక్టరీ వెంకటేష్ సినిమాలో క్రేజీ ఆఫర్ కొట్టేసింది!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం 47’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో వచ్చే ఒక కీలకమైన పాత్ర కోసం తాజాగా నివేదా పేతురాజ్‌ను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్!

గతంలో అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన నివేదా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించడం ఇది రెండోసారి. ఈసారి కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో నివేదా కనిపించబోతుందట. 'దాస్ కా ధమ్కీ' సినిమా తర్వాత తెలుగులో లాంగ్ బ్రేక్ తీసుకున్న నివేదాకు.. ఈ మూవీ ఖచ్చితంగా సరైన రీఎంట్రీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టైటిల్‌లోనే 'ఏకే 47' హింట్ కనిపిస్తున్న ఈ సినిమా.. అటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఇటు మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ ప్యాకేజీలా సిద్ధమవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ‘ఆదర్శ కుటుంబం’తో నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి!

Tags:    

Similar News